11 నెల‌ల కాలంలో 42 మంది విద్యార్థులు మృతి..

harish-20.jpg

రేవంత్ పాల‌న‌లో గురుకులాలు అస్త‌వ్య‌స్తంగా మారాయి. ఫుడ్ పాయిజ‌న్‌, పాముకాట్ల‌తో విద్యార్థులు ఆస్ప‌త్రుల పాలవుతున్నారు. తాజాగా న‌ల్ల‌గొండ జిల్లా కేతెప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. నల్ల‌గొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తీవ్రంగా కలిచివేసింది. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతుండడం సిగ్గుచేటు. గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారడం దురదృష్టకరం. విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దనే ఉన్నా ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేయడని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Share this post

scroll to top