వాంకిడికి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటని, ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. వాంకిడిలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించేందు వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.