ఎవరితోనైనా సరే హ్యాండ్ రెజ్లింగ్ ఆడి గెలుస్తా..

bigg-boss-27-.jpg

బిగ్‌బాస్ సీజన్ 8లో ఇటీవల ఎక్స్ కంటెస్టెంట్లను రప్పించి నామినేషన్స్ చేయించిన సంగతి తెలిసిందే. ఇది ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో మరోసారి బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించారు. టికెట్ టూ ఫినాలే టాస్కులు నిర్వహించేందుకు కొంతమంది మాజీలు హౌస్‌లోకి వస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో అఖిల్ సార్థక్-అలేఖ్య హారిక ఇద్దరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిని చూసి హౌస్‌మేట్స్ గట్టిగానే షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్ వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటి అంటూ భయపడ్డారు.

ఇక ఉన్న హౌస్‌మేట్స్ నుంచి ఇద్దరిని టికెట్ టూ ఫినాలే కంటెండర్‌షిప్ గెలిచేందుకు పోటీదారులుగా సెలక్ట్ చేయాలని అఖిల్-హారికలకి బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఇంతమందిలో ఎవరిని ఎలా సెలక్ట్ చేయాలా అంటూ ఇద్దరూ ఆలోచించారు. అయితే కంటెస్టెంట్లు వీళ్లని ఇంప్రెస్ చేసేందుకు వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేశారు. ఇందులో భాగంగా గౌతమ్.. పృథ్వీలా యాక్ట్ చేసి చూపించాడు. బాడీ లాంగ్వేజ్ సూట్ కాకపోయినా డైలాగ్ మాత్రం ఏజ్ ఇట్ ఈజ్ చెప్పాడు గౌతమ్.

కాసేపటికి పృథ్వీ నేను హౌస్‌లో ఎవరితోనైనా సరే హ్యాండ్ రెజ్లింగ్ ఆడి గెలుస్తా అంటూ సవాల్ చేశాడు. గౌతమ్ సవాల్‌కి వస్తే.. పృథ్వీ ఓడించి షాకిచ్చాడు. ఇక మొత్తం హౌస్‌మేట్స్ నుంచి రోహిణి-గౌతమ్ ఇద్దరినీ టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు సెలక్ట్ చేశారు అఖిల్-హారిక. అయితే గౌతమ్-రోహిణికి మరో ఇద్దరిని సెలక్ట్ చేసే ఛాన్స్ రావడంతో వాళ్లు తేజ-విష్ణుప్రియను తీసుకున్నారు.

Share this post

scroll to top