పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం పై సోమవారం ఆయన ట్వీట్ చేశారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తున్నదని ఒక్క హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహ జ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. కాగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఈ పథకం కింద ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.