అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయింది.
ఇక ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. దాదాపు 1060 కోట్ల బిజినెస్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నెల రోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్ఫ్ మొదలయ్యాయి. గంటలలో అన్నీ అమ్ముడుపోయాయి. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా ఇది నిలిచింది. కేవలం బుక్ మై షోలోనే ఇన్ని టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం సుమారు 12 వేల 500పైగా థియేటర్లలో విడుదలకాబోతంది. తొలి రోజే 55 వేల షోస్ వేస్తున్నారు. ఈ ఘనత పుష్ప 2కు మాత్రమే దక్కింది. 80 దేశాల్లో ఆరు భాషల్లో ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.