పుష్ప రాజ్ మాస్ జాతర ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున పుష్ప 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ష్ప 2′ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయం సాధించింది. పుష్ప 1 కు మించి ఈ సినిమా ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 ఘనవిజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుష్ప 2 తొలిరోజే భారీగా వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు పుష్ప ఎంత వసూల్ చేసిందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తొలి రోజు వసూళ్లతో పుష్ప 2 అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది.
అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వందకోట్లు వసూల్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత తొలి రోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలైంది. డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు రూ. 10 కోట్లు రాబట్టింది. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో రూ.165 కోట్లు వసూలు చేసింది. దీని ద్వారా సినిమా మొత్తం వసూళ్లు రూ. 175 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుంటే పుష్ప సినిమా కలెక్షన్ దాదాపు రూ. 250 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.