బిగ్‏బాస్ హౌస్‏లో అలా.. బయట ఇలా.. 

bigg-boss-17-.jpg

బిగ్‏బాస్ హౌస్ లో నిఖిల్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే తెలిసింది తనే నా భార్య అని. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని బ్రేకప్స్ మర్చిపోయేలా చేసింది. నవంబర్ 22తో మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా ? కలిసి ఉన్నామా అని నన్ను అడిగితే ఆ ఎమోషన్ బాండ్ నుంచి విడిపోలేదు. భవిష్యత్తులోనూ తనతోనే ఉంటాను. తనే నా భార్య. హార్ట్ లో ఫిక్స్ అయిపోయా. ఫ్యామిలీ అంతా వచ్చేసరికి కష్టమై సైలెంట్ అయ్యాను. కొంచెం స్పీచ్ ఇచ్చాను. ఆమెతో నాకు జన్మ జన్మలకు సరిపోయే జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. విడిపోయినప్పుడు తనపై చాలా కోపం వచ్చింది. నావైపు కూడా తప్పు ఉంది. నేను మంచివాడిని అని చెప్పడం లేదు. నాకు మా అమ్మ ఎలాగో తను కూడా అలాగే. తనని వదిలేయలేదు. ఈ షో తర్వాత తన దగ్గరకు వెళ్లిపోతాను. ఏడ్చినా, కోప్పడినా మళ్లీ వెళ్తా. పిచ్చిలేస్తే లేపుకుపోతా ఐయామ్ సారీ. ఈ షో నుంచి బయటకువచ్చిన మరుక్షణమే నీ ముందు నిలబడతా నువ్వు నాకు కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్.

కానీ బిగ్‏బాస్ సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్ ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. టైటిల్ గెలిచారు. మరీ తన దగ్గరకు వెళ్తానని చెప్పారు. మరి వెళ్తారా ? అని యాంకర్ అర్జున్ అంబటి అడగ్గా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. షో పూర్తికాగానే తన దగ్గరికే వెళ్తానని చెప్పాను. కానీ ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు. వెళ్లి మాట్లాడాలనే అనుకుంటున్నాను కానీ నన్ను ఇక్కడ ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అమ్మ, నాన్న, ఫ్యామిలీ వాళ్లందర్నీ పలకరించి ఆమె దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నా చూడాలి ఏమౌతుందో అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్.

Share this post

scroll to top