కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయాలి..

thalasani-20.jpg

మాకు కాదు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్‌ పార్టీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. అసెంబ్లీలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత, అసభ్య ప్రవర్తన వివాదంగా మారింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడారు. సభలో మాకు చెప్పు చూపించారని ఆగ్రహించారు. మేము మాట్లాడితే తాగి వచ్చామని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్ ను పిలిపించి ఆల్కహాల్ పరీక్ష చేయించండని డిమాండ్‌ చేశారు. మేమందరం టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరు గ్యారంటీల పై మేము ప్రభుత్వాన్ని నియాలదీస్తుంటే మా సీనియర్ ఎమ్మెల్యే కేటిఆర్ పై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహించారు. దేశంలో ప్రధాన సమస్య ఈ కార్ రేసు పై చర్చ పెట్టాలని అంటున్నాం శాసన సభలో జరిగిన ఘటనల పుటేజ్ ని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు తలసాని.

Share this post

scroll to top