నైజీరియాలో పెరిగిన అందాల సుందరీ..

bhagya-sri-30.jpg

భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందంతో అబ్బాయిల హృదయాలను కొల్లగొట్టింది. మిస్టర్ బచ్చన్ సినిమా తెరపైకి రాకముందే ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. భాగ్యశ్రీ డేట్స్ కోసం చాలా మంది మేకర్స్ క్యూ కడుతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ ఇంకా సెట్స్‌లో ఉండగా, భాగ్యశ్రీకి క్రేజీ ఆఫర్ వచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ బ్యూటీ గౌతమ్ తిన్ననుని దర్శకత్వంలో ‘VD 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతోంది.

Share this post

scroll to top