ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..

prabass-31.jpg

డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని, మహిళా భద్రత క్యాంపెయిన్ విషయంలో చొరవ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీ నుంచి సహకారం కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ జీవితంలో మనకి ఎన్నో ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బ్రతికే మనవాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని పేర్కొన్నారు.

Share this post

scroll to top