గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది . ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. SS రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులకు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. సినిమా విడుదల కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా మెగాభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 4వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఫంక్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగాభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాబాయి, అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామంటున్నారు మెగా ఫ్యాన్స్.