వయసు పెరిగే కొద్దీ జీర్ణ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరిచేందుకు ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి. వీటిని తరచూ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఆహారాలను జీర్ణం చేసి, పోషకాలు శరీరానికి అందించడంలో జీర్ణ వ్యవస్థ చేసే పాత్ర చాలా ముఖ్యం. ఒక్కోసారి ఈ జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయదు. తిన్న ఆహారం జీర్ణం చేయడానికి కూడా చాలా సమయం తీసుకుంటుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు సరిగా లేకపోతే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం సమస్య వంటివి తలెత్తుతాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచేందుకు ఇప్పుడు చెప్పే ఆహారాలు తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తాయి. పెరుగులో ప్రో బయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పని తీరు సరిగా లేనప్పుడు పెరుగు, మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. యాపిల్ కూడా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో పెక్టిన్ రసాయనం జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అదే విధంగా సోంపు తిన్నా జీర్ణ వ్యవస్థ కదలికలు సరిగ్గా ఉంటాయి. బొప్పాయి పండు తిన్నా కూడా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరిచి, తిన్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తినప్పుడు బీట్ రూట్ తింటే తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. పెద్ద పేగులో మలాన్ని బయటకు పంపుతుంది. భోజనానికి ముందు పుదీనా రసం లేదా అల్లం రసం తీసుకున్నా జీర్ణ వ్యవస్థ కదలికలు సరిగ్గా పని చేస్తాయి.