గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా, 400 మంది పోలీసు అధికారులతో పాటు, 1200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు కోసం సమకూర్చారు. కోల్ కత్తా – చెన్నై జాతి రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నారు. అలాగే, ఈవెంట్ జరుగుతున్న గ్రౌండ్ సమీపంలోని వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ ను మళ్లించారు. గోదావరి నాలుగో వంతెన మీదగా భారీ వాహనాలు దివాన్ చెరువు వద్ద జీరో పాయింట్ డైవర్షన్ చేయబడతాయి. గ్రౌండ్ సమీపంలో 20వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు.