బెయిల్‌ పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్..

allu-arjun-04.jpg

సంధ్య ధియేట‌ర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి రెగ్యుల‌ర్ బెయిల్ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన బ‌న్నీ బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయ‌మూర్తి ముందు హాజ‌రైన బ‌న్నీ రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. మ‌రోవైపు రెండు నెలల పాటు ప్ర‌తి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయ‌స్థానం అల్లు అర్జున్‌ని ఆదేశించింది. పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విష‌యం తెలిసిందే. రేవ‌తి మ‌రణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ ఆయ‌న‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Share this post

scroll to top