పంట పండించే ప్రతీ గుంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. హన్మకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పొంగులేటి అనంతరం మాట్లాడారు. పేద పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని అందుకే 200 శాతం మెస్ చార్జీలు పెంచామన్నారు. ఆర్టీసీ దండగన్నారు, ఆర్టీసి కార్మికులను విస్మరించారని కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అంటే ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును చేస్తున్నామని మేము చేసే మంచి పనులను ఓర్వలేక పోతున్నారని ఆగ్రహించారు. సంక్రాంతి తర్వాత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే మా లక్ష్యమని తెలిపారు.
పంట పండించే ప్రతీ గుంటకు రైతు భరోసా..
![poguleti-06.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/poguleti-06.jpg)