ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దిల్ రాజు పై ఫైర్..

dill-raju-09.jpg

టాలీవుడ్ ప్రోడ్యూసర్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కాగా ఇటీవల నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నిజామాబాద్ లో పెట్టిన ఈవెంట్ ను రియాక్షన్ తక్కువ ఉందని ఆంధ్ర లో పెట్టి ఉంటే ప్రతి సినిమాకు ఓ వైబ్ ఇస్తారని తెలంగాణలో అయితే తెల్ల కల్లు మటన్ కు వైబ్ ఇస్తారని దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.. తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకొ, వైబ్ కావాలంటే కల్లు కాంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకోవాలని సూచించారు. అలాగే దిల్ రాజుకు తెలంగాణతో ఏ సందర్భంలో సంబంధం లేదని, అలాంటి వ్యక్తి కూడా తెలంగాణ ప్రజల పై సెటైర్లు వేస్తూ.. తెలంగాణ కల్చర్‌ను అవమానకరంగా సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వైబ్ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటపడి టికెట్ రేట్ల పెంపుకు ఎందుకు ఆర్డర్లు తెచ్చుకున్నావని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

Share this post

scroll to top