భూ భార‌తికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం..

pogulati-09.jpg

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వ‌ర‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని గురువారం నాడు స‌చివాల‌యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌ని ఇందుకు సంబంధించిన క‌స‌రత్తు కొలిక్కి వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాలి. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ విభాగం ప‌నిచేయాలి. రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌. ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌జ‌లు కేంద్ర‌బిందువుగా మా ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, ఆలోచ‌న‌లు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామ‌న్య ప్ర‌జ‌లు సంతోష‌ప‌డేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేయాలి అని అన్నారు.

Share this post

scroll to top