సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను సీఎం చేశారని అన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు.
నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే అవార్డుకే వన్నె వస్తుందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఈరోజు ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పంచనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు.