కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన రామకృష్ణారావు విచారణ..

kaleswram-21-.jpg

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు బ్రేక్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ తిరిగి ఇవాళ బీఆర్‌కే భవన్‌కు చేరుకొని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం కమిషన్ ఎదుట కీలక అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు. కమిషన్‌కి ఆయన ఇప్పటికే అఫిడవిట్‌ సమర్పించిన విషయం తెలిసిందే.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన అంశాలు, బ్యారేజీల పనులు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కమిషన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. కాగ్ నివేదిక, అఫిడవిట్ ఆధారంగా బిల్లుల చెల్లింపులు, తదితర అంశాలపై ఆయన్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రత్యేక ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు ఉన్నారు. కేబినెట్‌ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు విడుదల చేసినట్టు కమిషన్ గుర్తించినట్లు సమాచారం.

Share this post

scroll to top