పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. పార్టీ పెద్దలు, కార్యకర్తల సూచలన మేరకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చిన లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.