షుగర్ పేషెంట్లకు ఈ డ్రైఫ్రూట్‌ ఒక వరం..

pista-22.jpg

అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ లో పిస్తా కూడా ఒకటి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిస్తాపప్పు వాత దోషం నుండి ఉపశమనం కలిగిస్తాయి. పిస్తాలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడతాయి. పిస్తాపప్పులు కూడా కళ్లకు చాలా మేలు చేస్తాయి. అంతే కాదు రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. పిస్తాపప్పు తీసుకోవడం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తాలు చాలా ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్‌. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కళ్లకు ఉపయోగపడుతుంది: పిస్తాలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. పిస్తాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

ఊబకాయం: మీరు బరువు తగ్గాలనుకుంటే పిస్తా మీకు చాలా సహాయపడుతుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలం. పిస్తాలను మితంగా తినడం వల్ల బరువు తగ్గుతారు.

ఎముకలకు ఉపయోగపడుతుంది: పిస్తాపప్పులు ఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి. పిస్తాలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

కొలెస్ట్రాల్: మీరు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే, మీ ఆహారంలో పిస్తాలను చేర్చుకోవచ్చు. పిస్తాపప్పులో ఉండే సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: పిస్తాపప్పు తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. పిస్తాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇమ్యూనిటీ బూస్టర్: పిస్తాలో ఉండే టోకోఫెరోల్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Share this post

scroll to top