దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు..

dill-raj-24-.jpg

హైదరాబాద్‌లో టాలివుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగో రోజు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగాయి. దిల్ రాజు ఇంటి నుంచి అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీల్లో భాగంగా దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి అధికారులు తమ వాహనంలోనే తీసుకెళ్లారు. ఎస్వీసీ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

Share this post

scroll to top