సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా నేహా శెట్టి..

neha-28.jpg

వినడానికి కష్టంగా ఉన్న ఇది మాత్రం నిజం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డామినేషన్ అంతా కన్నడ బ్యూటీలదే. ఇప్పుడు అని కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు శాండిల్‌వుడ్ హీరోయిన్‌లు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. సౌందర్య, అనుష్క శెట్టి, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే వెలిగిపోయింది నేహా శెట్టి. కన్నడ ముంగరు మేల్ 2 సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పూరి జగన్నాథ్ కళ్లలో పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన మెహబూబా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా.

ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ లో సెకండ్ హీరోయిన్ రోల్‌లో నటించింది. దీం తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘డీజే టిల్లు’ మూవీ హీరోయిన్‌గా నేహ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. రాధికగా లిప్ లాక్ సీన్స్‌‌లో రెచ్చిపోయి యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అనంతరం మంచి అవకాశాలు అందుకుంది నేహా. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తను చేసే స్కిన్ షో కి కుర్రలు ఫిదా అవుతుంటారు. 

Share this post

scroll to top