ప్రయాగ్ రాజ్‌కు విమాన ఛార్జీలు భారీగా పెరగడంపై చాలా మంది ప్రయాణికులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి, జనవరి 27న మహా కుంభమేళాకు విమాన ఛార్జీలను పెంచవద్దని DGCA విమానయాన సంస్థలను కోరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు 132 విమానాలు నడుస్తున్నాయి. స్పైస్‌జెట్ ఫిబ్రవరి 2025 నుండి ఢిల్లీ, చెన్నై, గౌహతి, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, జైపూర్, హైదరాబాద్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు కొత్త విమానాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుంది. ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. మహా కుంభమేళా సమయంలో భక్తులకు ఉపశమనం కలిగించడానికి, ప్రయాణం సులభతరం, అందుబాటులో ఉండేలా ప్రభుత్వం, విమానయాన సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.