దేవర-2 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

devara-29.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘దేవర’. భారీ బడ్జేట్‌తో రూపొందించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్-2 ఉంటుందని గతంలోనే మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం. ‘దేవర పార్ట్-2’ లో భారీ యాక్షన్ సీన్లు, ట్విస్టులు ఉండేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ప్రస్తుతం ఈ పార్ట్-2కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ స్క్రిప్టులో కూడా భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ తరహాలో ఫ్యాన్స్‌ను మెప్పించేలా సీన్స్ రాసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే ‘దేవర-2’ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this post

scroll to top