విశ్రాంత ఉద్యోగుల ఆవేదన..

harish-rao-30.jpg

రిటైర్మెట్‌ బెనిఫిట్స్‌ అందక దిక్కుతోచని స్థితిలో రిటైర్డ్‌ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల ఆవేదన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అర్థం కాదా అని ప్రశ్నించారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా రేవంత్‌ సర్కార్‌ చేసిందని మండిపడ్డారు. పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో, విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వమని విమర్శించారు. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన రూ.80- 90 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఎక్స్‌ వేదికగా డిమాండ్ చేశారు.

Share this post

scroll to top