రేపు కేటీఆర్ సుప్రీం లాయర్లతో భేటీ..

ktr-05.jpg

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ చర్చించనున్నారు. అందుకోసం ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం కింద నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారికి నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారిపై అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని కేటీఆర్ ధీమాగా ఉన్నారు. అందుకే బైపోల్స్‌కు సిద్ధంగా ఉండాలని కేడర్‌‌కు పిలుపునిచ్చారు.

Share this post

scroll to top