ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో ఆమె ఒకరు. నటిగా తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. విభిన్నమైన కథలు వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా ఇంతకీ ఆమె ఎవరంటే ఆ బ్యూటీ మరెవరో కాదు హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పరం సుందరి అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుంది. ఇందులో బీటౌన్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ షేర్ చేసిన ఫోటో చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.