బయోపిక్‌ లో నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రి..

dipthi-08.jpg

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అంతే కాకుండా తన అందంతో యూత్‌ని సైతం తన వైపు తిప్పుకుని ప్రజెంట్ నేషనల్ క్రష్‌గా రాణిస్తుంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల బ్యాడ్ న్యూజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు ఓ స్టార్ నటి బయోపిక్‌లో నటించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మేటి నటి పర్వీన్ బాబీ జీవిత కథ వెబ్‌సిరీస్ రూపంలో రానుంది. పర్వీన్ బాబీ పాత్రలో త్రిప్తి దిమ్రి నటించనుంది. షోనాలీబోస్ దర్శకత్వం వహించబోతున్న ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుండగా డేట్ మాత్రం కన్ఫామ్ కాలేదు.

పర్వీన్ బాబీ విషయానికి వస్తే 70-80 దశకంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తన అందంతో, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈమె అప్పట్లో యువతకు కలల రాణిగా ఉండేది. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న పర్వీన్ బాబీ 2005లో కన్నుమూశారు. ఇప్పుడు ఆమె బయోపిక్ వస్తుండటంతో అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇక పర్వీన్ బాబీ పాత్రలో నటిస్తున్న త్రిప్తి దిమ్రి కూడా ఈ సినిమా కోసం ఆమె నటించిన సినిమాలను చూస్తుందని చెబుతున్నాడు డైరెక్టర్.

Share this post

scroll to top