యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం చై కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.21 కోట్లకు పైగా గ్రాస్ అందుకోగా రెండో రోజు సైతం రూ.20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. అలా రిలీజ్ అయిన 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ.41.2 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక మూడోరోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్‌ను చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా, ఆల్ మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా మూడో రోజుకు రూ.62.37 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధిక వసూళ్లు రాబడుతుంది.
నాగ చైతన్య మాస్ జాతర..
