సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చిన వర్మ తరఫు లాయర్..

ram-gopal-varma-10.jpg

గుంటూరులో సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నానని 8 వారాల సమయం కావాలని ఆ 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. తనకు నోటీసులు అందజేసిన సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. సీఐడీ చీఫ్ రవి శంకర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు వర్మ అయితే, సీఐడీ విచారణకు ఆర్జీవీ హాజరుకాలేకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తరఫు న్యాయవాది నాని బాబు.

అనారోగ్య కారణాలతో గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్ సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు. అనారోగ్య కారణాలతో ఆయన విచారణకు హాజరు కాలే పోతున్నారని, వర్మ తరపు న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సామాజిక మధ్యమాలలో పెట్టిన పోస్టుల కారణంగా వర్మ మీద కేసు నమోదు అయిందని, ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ పోలీసులు వర్మకి నోటీసులు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది అంటున్నారు. 8 వారాల సమయం కోరాం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటూన్నారు వర్మ తరుపున న్యాయవాది.

Share this post

scroll to top