కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. రాహుల్‌గాంధీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు హనుమకొండలో పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు ఆయన చేరుకుంటారని తొలుత పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అక్కడి నుంచి ట్రైన్ లో తమిళనాడుకు వెళ్తారని ప్రకటించారు నేతలు. ఓ ప్రైవేటు కార్యక్రమం నేపథ్యంలో వస్తున్నారన్న వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తమ అగ్రనేతకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు సైతం సిద్ధమయ్యారు. అయితే ఆఖరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురయ్యారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..
