పాత వారికి రెన్యూవల్ చేస్తారా లేక కొత్త వారికి ఇస్తారా..

kcr-07.jpg

నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు గులాబీ బాస్. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్సీ వస్తుంది. పాత వారికి రెన్యూవల్ చేస్తారా లేక కొత్త వారికి ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ రోజు కేసీఆర్ తో పార్టీ నేతల భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Share this post

scroll to top