నేరుగా ఆ స్టార్ హీరోయిన్‌‌‌ని క్వశ్చన్ చేసిన నెటిజన్..

malavika-13-.jpg

సినిమాల్లో ఎంత బోల్డ్‌గా కనిపించినా, వ్యక్తిగతంగా కొన్ని హద్దులు ఉండాలని భావించే హీరోయిన్ల కూడా ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక్కరు. తమిళం నుంచి బాలీవుడ్ వరకు తన అందంతో, నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కెరీర్ పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మళవిక. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఆమె ఓ ట్విట్టర్ సెషన్‌లో ముచ్చటించగా అందులో ఫ్యాన్స్ కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగితే, మరికొంతమంది మాత్రం హద్దులు మీరేలా ప్రశ్నలు అడిగారు. ఓ నెటిజన్ తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే, ఇంతలోనే మరో నెటిజన్ మరింత దారుణం మీరు వర్జినా? అంటూ ప్రశ్నించాడు. ఇది చూసి మాళవిక షాక్ అయ్యింది. ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. చెత్త ప్రవర్తన మానేయండి అంటూ తిప్పికొట్టింది.

Share this post

scroll to top