రజనీకాంత్ కూలీ రికార్డు ధరకు ఓటీటీ డీల్ క్లోజ్..

rajani-15.jpg

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య పలు కారణాల రీత్యా షూటింగ్ వాయిడా పడిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, శృతి హాసన్ తో పాటు మరికొందరిపై సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

ఈ సినిమా రైట్స్  కు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఒక్కో డీల్ ను భారీ ధరకు క్లోజ్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా కూలీ ఓటీటీ రైట్స్ ను క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ పాన్ ఇండియా సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓటీటీ హక్కుల విషయంలో ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిచ్చర్స్ బ్యానర్ పై  కళానిధి మారన్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.

Share this post

scroll to top