కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రూ లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2500 ఇచ్చారని ప్రశ్నించారు. రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారన్నారు. ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారని, తులం బంగారం ఎంతమందికి ఇచ్చారని నినదించారు. 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పుచేసినా అభిమాత్రం సున్నా అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వినూత్న నిరసన..
