రేపు తెలంగాణ భవన్ లో నేతల సమావేశం..

varangal-07.jpg

రేపు తెలంగాణ భవన్ లో గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశం జరుగనుంది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించబోయే బహిరంగ సభ విజయవంతం చేయడంపై భేటీ చర్చించనున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై నర్సింలు యాదవ్ ఆధ్వర్యంలో పది మందికిపైగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే సహకార సంఘంలో మాజీ ముఖ్యమంత్రి ఫొటో ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోనే ఉండాలంటూ అద్దాలపై ఉన్న కేసీఆర్, నాటి ప్రభుత్వ పథకాల స్టిక్కర్స్, ఫ్లెక్సీ లు చించేశారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Share this post

scroll to top