భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. పాకిస్తాన్ హెచ్చరికలకు భారత్ భయపడదని త్రివిధ దళాలు గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. పహల్గామ్ దాడితో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణ కమ్ముకొస్తోంది. పాకిస్తాన్ ప్రధాని, మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. భారత్ వాటికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సైన్యం ద్వారా తెలియజేస్తోంది. ఈ లాంటి కీలక సమయంలో హైదరాబాద్ DRDOలో స్క్రామ్‌జెట్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. దీంతో ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి, పాక్‌కు తెలియజేస్తున్నారు. స్క్రామ్‌జెట్ ఇంజన్‌తో నెక్స్ట్ జనరేషన్ హైపర్ సోనిక్ మిసైల్స్ తయారీకి లైన్ క్లియర్ అయ్యింది. స్క్రామ్ జెట్‌కు సుదూర లక్ష్యాలను సులభంగా ఛేదించే సామర్థ్యం ఉంది. హైపర్ సోనిక్ టెక్నాలజీలో భారత్ చరిత్ర సృష్టించబోతుంది. గంటకు 6100 కి.మీ వేగంతో ప్రయాణించ గల సామర్థ్యం పెరుగుతుంది.
హైదరాబాద్ నుంచే పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం..
