కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన రెట్రో మూవీ మే1న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. అయితే ఈ సినిమా తర్వాత సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటలో సూర్య మాట్లాడుతూ తన నెక్ట్స్ మూవీ వెంకీ అట్లూరితో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వంశీ నిర్మిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇది విన్న నెటిజన్లు వీరిద్దరి కాంబోలో మూవీ అంటే పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.