లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ వేరు. కేవలం నయనతార అనే బ్రాండ్ మీద సినిమా చేసి ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించగల సత్తా నయన్ కు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ జవాన్ సూపర్ హిట్ తో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. రీజనల్ సినిమాకు ఓ రేటు పాన్ ఇండియా చిత్రాలకు మరో రేటు చార్జ్ చేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె చేస్తున్న పాన్ సినిమా టాక్సిక్, మూకుత్తి అమ్మన్ 2 కోసం ఏకంగా రూ. 12 కోట్లను తీసుకుంటుందట నయన్.
తెలుగు సినిమా వంతు. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కోసం నయన్ను సంప్రదించారు మేకర్స్. గతంలో చిరు, నయనతార కాంబోలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో వీరి పెయిర్ కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇప్పుడు చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నయన్ ను అప్రోచ్ అయ్యారు మేకర్స. ఇటీవల నయన్ ను కలిసి కథ వినిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకు నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కాగా చిరు సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతుందని సమాచారం. వినిపిస్తున్న టాక్ ని బట్టి ఏకంగా రూ. 18 కోట్లు మేర తీసుకుందనే గాసిప్ కూడా టాలీవుడ్ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.