గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు..

mining-06.jpg

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల విచారణ తర్వాత తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి పీఏ మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా తేల్చింది. కాగా, వీరందరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల విచారణ తర్వాత తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.

అయితే, గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి పీఏ మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా తేల్చింది. కాగా, వీరందరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2007 జూన్‌ 18వ తేదీన అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్ధన్‌రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్‌ఆర్ సర్కార్. అయితే, ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా-అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్‌ 7వ తేదీన సీబీఐ కేసు ఫైల్ చేసింది. ఇక, 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేయగా గాలి జనార్దన్‌రెడ్డి, గాలి పీఏ మెఫజ్‌ అలీఖాన్‌, సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్‌, కృపానందం, బీవీ శ్రీనివాస్ రెడ్డిల పేర్లు ఛార్జిషీట్‌లో నమోదు చేర్చారు. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని నిందితులుగా సీబీఐ చేర్చింది.

Share this post

scroll to top