మంగళవారం అర్దరాత్రి తర్వాత పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత్. పహల్గామ్ లోని పర్యాటకుల పై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడుల్లో వందలమంది ఉగ్రవాదులు హతం అయ్యారని సమాచారం. ఇప్పటికే ఈ దాడిపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. మరోవైపు సినీతారలు సైతం ఆపరేషన్ సింధూర్ పై రియాక్ట్ అవుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై మంగళవారం అర్దరాత్రి భారత్ ఆర్మీ విరుచుకుపడింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచదేశాలు మాట్లాడుకుంటున్నాయి. హింస కాదు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా వంటి దేశాలు సూచిస్తున్నాయి. ఇక భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఈ ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా జై హింద్ అంటూ ట్వీట్ చేయగా ఇప్పుడు అల్లు అర్జున్, తనికెళ్ల భరణి, సుధీర్ బాబు, అనన్య నాగళ్ల వంటి స్టార్స్ రియాక్ట్ అవుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ పై టాలీవుడ్ సినీతారలు..
