జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో స్టూడెంట్ నెంబర్ 1 ఒకటి. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ముందుగా ప్రభాస్ హీరో అనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఈ సినిమాను డార్లింగ్ చేయలేకపోయారు. దీంతో అదే కథ ఎన్టీఆర్ వద్దకు చేరింది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. 2001లో విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. ఇందులోని భారీ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ అన్ని సినిమాకు హైలెట్ అయ్యాయి. కెరీర్ తొలినాళ్లల్లోనే రాజమౌళి చెప్పిన సినిమాను రిజెక్ట్ చేసిన హీరోగా ప్రభాస్. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఛత్రపతి, బాహుబలి 1, 2 సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి.
ప్రభాస్ చేయాల్సిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఎన్టీఆర్..
