శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు సంబందించిన డబ్బులు ఇవ్వడం లేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ఎదుట ధర్నా దిగాడు మోహన్ బాబు. తన విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ తో కలిసి రోడ్ పై పడుకుని నిరసన తెలిపాడు. దాంతో తిరుపతి-మదనపల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ టైమ్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ధర్నా చేపట్టినందుకు గాను అప్పటి ఎంపీడీవో, ఎంసీసీ టీమ్ అధికారి హేమలత చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు, మనోజ్, విష్ణులపై కేసు నమోదు చేసారు పోలీసులు.
అయితే ఈ కేసులో క్వాష్ కొసం మోహన్ బాబు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించాడు. ప్రవైట్ అనుబంధ సంబంధింత వ్యక్తులకు ఎన్నికల కోడ్ అమలు కాదని, మోహన్ బాబుకు 75 ఏళ్ల వయసని ఆయన ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని అయినా క్వాష్ చేయాలనీ మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినియించాడు. కానీ అందుకు సుప్రీం కోర్టు నిరాకరించి స్థానిక కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. కాగా నేడు ఈ కేసు విచారణకు రానుండడంతో నేడు తిరుపతి కొర్డులో మోహన్ బాబు,మంచు విష్ణు,మంచు మనోజ్ హాజరుకానున్నారు. స్థానిక న్యాయస్థానం ఈ కేసులో ఎటువంటి తీర్పునిస్తోందోననే ఉత్కంఠ మంచు ఫ్యామిలీతో పాటు అయన అభిమానుల్లోనూ నెలకొంది.