సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు అయింది. బెంగళూరులో కాంక్లేవ్ కార్యక్రమానికి హాజరు కావల్సి ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు అయింది. ఇక అటు హైదరాబాద్ లోని బుద్ధ భవన్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య పెరిగిపోయి అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఢిల్లీలో పాటు దేశంలోని అనేక మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది ఇది ప్రజలు గుర్తించాలని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు..
