పాకిస్థాన్‌ HQ-9 ఇండియా S-400 మధ్య తేడా ఏంటి..

ind-09.jpg

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌, పాకిస్తాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అనేక వైమానిక దాడులను ప్రారంభించింది. వాటిని భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అడ్డుకుంది. వెంటనే ప్రతి దాడి కూడా ప్రారంభించింది. కరాచీ పోర్ట్‌పై దాడి చేసినట్లు సమాచారం. అయితే పాకిస్థాన్‌ మన దేశంపై ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మన విజయవంతంగా అడ్డుకోవడానికి అధునాతన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ఈ సిస్టమ్‌ను మనం రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసింది. అయితే మన దగ్గర ఉన్నట్లే పాకిస్థాన్‌ వద్ద కూడా HQ-9 అనే డిఫెన్స్‌ సిస్టమ్‌ ఉంది.

S-400

600 కిలో మీటర్ల వరకు క్షిపణి లక్ష్య పరిధి 400 కిలో మీటర్ల వరకు క్షిపణి రకాలు 120 కి.మీ, 200 కి.మీ, 250 కి.మీ, 400 కి.మీ వేరియంట్లు ఫైటర్ జెట్‌లు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులను సెకన్లలోనే నాశనం చేయగలదు. ప్రతి స్క్వాడ్రన్‌లో లాంచర్లు, రాడార్లు, కమాండ్ సెంటర్లు, సహాయక వాహనాలతో కూడిన 16 వాహనాలు ఉంటాయి.

HQ-9

200 కిలో మీటర్ల వరకు క్షిపణి పరిధి మధ్యస్థ-శ్రేణి అడ్డగింపు సామర్థ్యం పాత సోవియట్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, దీనికి ఆధునిక వ్యవస్థల బహుముఖ ప్రజ్ఞ, కచ్చితత్వం లేదు. మే 7న పాకిస్తాన్, పీఓకేపై దాడుల సమయంలో భారత విమానాలను గుర్తించడంలో విఫలమైంది. భారతదేశం ప్రతీకార దాడులలో HQ-9 యూనిట్లు దెబ్బతిన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Share this post

scroll to top