భారత సాయుధ దళాలపై మెగా కోడలు ఉపాసన పోస్ట్..

upasana-09.jpg

ఇటీవలే ఉపాసన తన భర్త రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. చరణ్ బాగా అర్థం చేసుకోవడమే కాదు సపోర్ట్ కూడా చేస్తాడంటూ చెప్పుకొచ్చింది. ఏమైనా చేయాలనుకుంటే దానికి వెంటనే సహకరిస్తాడని తెలిపింది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తన వెంట ఉంటాడని పేర్కొంది. సినిమాల్లో కాకపోయినా ఉపాసనకు హీరోయిన్ల లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా మెగా కోడలు తాజాగా దీనిపై సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నిన్న రాత్రి దేశం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు 15 భారతీయ నగరాలను రక్షించినందుకు భారత సాయుధ దళాలకు ధన్యవాదాలు. మేము స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి కారణం మీరే. ధన్యవాదాలు జై హింద్’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Share this post

scroll to top