భారత్‌పై పాక్ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్..

ind-10.jpg

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి ముదురుతున్నాయి. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ శనివారం తెల్లవారుజామున సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ తెల్లవారుజామున ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము చేపట్టిన సైనిక చర్యకు ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ తమ ఆపరేషన్ కు ఆ పేరు ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏంటి అనే అంశాలు ఆసక్తిగా మారాయి.

ఈ ఆపరేషన్ పేరు వెనుక లోతైన అర్థం ఉన్నదని ఇది ఖురాన్ నుంచి ఒక వచనం ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం బన్యాన్ మార్సూస్ అనేది అరబిక్ పదబంధం. చేధించలేని దృఢమైన గోడ అని అర్థం. నిజంగా అల్లాహ్ తన మార్గంలో యుద్ధ శ్రేణిలో పోరాడేవారిని ప్రేమిస్తాడు. వారు దృఢమైన నిర్మాణంలా ఉంటారు’ అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న ఒక దుర్భేద్యమైన గోడ లేదా నిర్మాణంగా చిత్రీకరించుకోవాలని కోరుకుంటుందని అలాగే ఈ సైనిక చర్యలకు ఆధ్యాత్మిక కోణాన్ని ఆపాదించే కుట్రలో భాగంగా పాక్ ఈ పేరు పెట్టి ఉంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

Share this post

scroll to top