భారత్, పాక్ యుద్ధం ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేస్‌లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కారిడార్, రక్షణ సంస్థల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమానస్పద వ్యక్తులు, ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే ఛార్మినార్, గోల్కొండకోట, సచివాలయం, ఐటీ కారిడార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, రాచకొండ తదితర ప్రాంతాల్లో డాగ్ స్కాడ్, క్లూస్ టీం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పార్క్ చేసిన పాత వాహనాలు, ఇతర రాష్ట్రాల బస్సులు, అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్‌లో పోలీసుల హై అలర్ట్..
