భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హైలెవల్ మీటింగ్ కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, సీడీఎస్ అనీల్ చౌహన్ తో పాటు త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రధానికి త్రివిధ దళాధిపతులు వివరిస్తున్నారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్‌పై పాకిస్తాన్ వరుస దాడులకు తెగబడుతుంది. జైసల్మేర్, ఫూంచ్, శ్రీనగర్‌ల్లో మరోసారి భారీ పేలుళ్లు సంభవించినట్లు భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని వెల్లడించారు. ఈ పేలుళ్ల కారణంగా ప్రజలు భయపడినట్లు తెలిపారు. పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి.. ప్రజలను భద్రతా బలగాలు అప్రమత్తం చేశామని వెల్లడించారు.
హైలెవల్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్..
